రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్దిలో అగ్రస్థానంలో ఉండాలి: హర్యానా గవర్నర్​ దత్తాత్రేయ

రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్దిలో అగ్రస్థానంలో ఉండాలి: హర్యానా గవర్నర్​ దత్తాత్రేయ

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో  అలయ్​ బలయ్​ కార్యక్రమం జరిగింది. 19 సంవత్సరాలనుంచి దత్తాత్రేయ కుంటుంబం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ... తాను తెలంగాణ బిడ్డనే నన్నారు. ప్రజలందరూ సోదరభావంతో ఉండాలని దత్తాత్రేయ అన్నారు.  

తెలంగాణ సంప్రదాయ వంటకాలను ఏర్పాటు చేశారు.  పలువురు గవర్నర్లు రావడంతో దేశమంతా హైదరాబాద్​ వచ్చినట్లు ఉందన్నారు.  2005 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి అన్నారు.  రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ది పథంలో అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్​ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్​కుమార్​ గౌడ్​, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి. పలువురు ఎంపీలు హాజరయ్యారు​. అతిథులకు విజయలక్ష్మి స్వాగతం పలికారు.